Tuesday, November 25, 2014

నేనుసైతం

నేనుసైతం

నేనుసైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేనుసైతం విశ్వవృష్టికి అసృవొక్కటి ధారవోశాను, నేనుసైతం భువనఘోషకు వెర్రిగొంతుక విచ్చిమ్రోశాను
చరిత్రలో ప్రపంచ ప్రగతికి కృషి చేసిన తాత్వికులు
 
  • AMBEDKAR DR B R
    BHAGAT SINGH
    BUDHA
    FRAUID
    KABIR
    KARL MARX
    KOMARAM BHEEM
    LENIN
    Leo Tolstoy (1828-1910)
    MAO
    MARX
    Maxim Gorky
    POTHULURI VEERABRHMAM
    RAJA RAMAMOHAN RAI
    SHIRIDI SAI BABA
    SOCRATIES
    SPORTACUS
    SRI SRI
    SRINIVASA RAMANUJAN
    STALIN
    SWAMY VIVCOMDA
    అన్నమయ్య (మే 9, 1408 - ఫిబ్రవరి 23, 1503)
    చిలకమర్తి లక్ష్మీనరసింహం(1867 - 1946)
    పానుగంటి లక్ష్మీ నరసింహారావు (1865-1940)
    రాణి రుద్రమ దేవి) (1259−1289)
    వేమన

స్వామి వివేకానంద

*ఒక వస్తువు పై మనస్సును కేంద్రికరింపజేయడమే ధ్యానం *నరేంద్రనాథ్ దత్తా1863 జనవరి 12 కలకత్తా,బెంగాలు ప్రిసిడెన్సీ, బ్రిటీషు పరిపాలనలోని భారతదేశం (ఇప్పుడు కోల్కతా, పశ్చిమ బెంగాల్, భారత దేశం) నిర్యాణము 1902 జూలై 4 (వయసు 39) బేలూరు మఠం, బెంగాలు ప్రిసిడెన్సీ, బ్రిటీషు పరిపాలనలోని భారతదేశం (ఇప్పుడు పశ్చిమ బెంగాల్, భారత దేశం)భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి ఉంది. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. భారతదేశాన్ని ప్రేమించి, భారతదేశం మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్త్వమును షికాగోలో జరిగిన ప్రపంచ మత జాతర (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్) లో 1893 లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. తిరిగి భారత దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్ఫై తొమ్మిది ఏళ్ళ వయసు లోనే మరణించాడు. అతను చేసిన సేవలకు గుర్తింపుగా 1984 లో భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని "జాతీయ యువజన దినోత్సవం"గా ప్రకటించింది. 

No comments: