బుద్ధుని బోధనలు – ప్రశ్నలు మరియు సమాధానాలు
బౌద్ధ ధర్మం శాంతి, సత్యం, దయ, కరుణ మరియు మానవ జీవన పరమార్థాన్ని తెలియజేసే గొప్ప తాత్విక మార్గం.
1. బౌద్ధం ఎందుకు ముఖ్యమైనది?
సమాధానం: బౌద్ధ ధర్మం ఉత్తమ మానవ జీవనానికి మార్గదర్శకమైంది. ఇది శాంతిమయమైన, సత్యవంతమైన, దయా-కరుణలతో కూడిన జీవనాన్ని గడపడానికి సహాయపడుతుంది.
2. త్రిరత్నాలు అంటే ఏమిటి?
- బుద్ధం శరణం గచ్చామి – బుద్ధుని ఆశ్రయించటం
- ధమ్మం శరణం గచ్చామి – ధర్మాన్ని ఆశ్రయించటం
- సంగం శరణం గచ్చామి – సంఘాన్ని ఆశ్రయించటం
3. ఆర్య సత్యాలు ఏమిటి?
- దుఃఖం ఉంది – జీవితం లో బాధలు సహజం
- దుఃఖానికి కారణం తృష్ణ
- తృష్ణకు మూలం అవిద్య
- అవిద్యను తొలగించేది అష్టాంగ మార్గం
4. పంచశీల సూత్రాలు ఏమిటి?
- హింస చేయకూడదు
- దొంగతనం చేయకూడదు
- లైంగిక అశుద్ధత లేకుండా ఉండాలి
- అబద్ధం చెప్పకూడదు
- మత్తు పదార్థాలు తీసుకోరాదు
5. అష్టాంగ మార్గం అంటే ఏమిటి?
- సమ్యక్ దృష్టి
- సమ్యక్ సంకల్పం
- సమ్యక్ వాక్కు
- సమ్యక్ కర్మ
- సమ్యక్ ఆజీవిక
- సమ్యక్ వ్యాయామం
- సమ్యక్ స్మృతి
- సమ్యక్ సమాధి
6. దశ పారమితలు ఏమిటి?
- దానం
- శీలం
- ఖాంతి
- వీర్యం
- ధ్యానం
- ప్రజ్ఞా
- ఉపేక్ష
- సత్యం
- ఆదిత్థానం
- మైత్రీ, కరుణ
7. మధ్యమ మార్గం అంటే ఏమిటి?
సమాధానం: భోగవిలాసం మరియు కఠినత మధ్య సమతుల్యతను పాటించే మార్గాన్ని మధ్యమ మార్గం అంటారు.
8. త్రి లక్షణాలు ఏమిటి?
- అనిత్యత – అన్ని వస్తువులు మార్పునకు లోబడి ఉంటాయి
- దుఃఖం – జీవితం అసంతృప్తితో నిండి ఉంది
- అనాత్మ – శాశ్వతమైన వ్యక్తిగత ఆత్మ లేదు
9. బౌద్ధ తత్వం ప్రధాన లక్ష్యం ఏమిటి?
సమాధానం: మానవ జీవిత పరమార్థాన్ని గ్రహించడం మరియు శాంతియుత జీవితం గడపడం.
10. బుద్ధుని బోధనలు మనకు ఏమి నేర్పిస్తాయి?
సమాధానం: దయ, కరుణ, సత్యం, ఆత్మపరిశీలన, శాంతి మరియు ధర్మబద్ధ జీవనాన్ని నేర్పిస్తాయి.
“అత్త దీపో భవ” — నీకు నీవే దీపంగా ఉండు.
No comments:
Post a Comment